*📚✍సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ 10, 12 పరీక్షలు రద్దు✍📚*
*♦సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు రెండు ఐచ్ఛికాలు*
*♦తరవాత జరిగే పరీక్షలకు హాజరవడమా?*
*♦అంతర్గత పరీక్షల మార్కులతో సర్టిఫికెట్ తీసుకోవడమా?*
*♦విద్యార్థుల నిర్ణయానంతరం ఫలితాలు ప్రకటించనున్న కేంద్రం*
*♦పూర్తి వివరాలతో నేడు వెలువడనున్న తాజా నోటిఫికేషన్*
*♦సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం*
*🌻న్యూఢిల్లీ,జూన్ 25:* సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దయ్యాయి. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగా ల్సిన 10, 12 తరగతుల వార్షిక పరీక్షలు రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) నిర్ణయం తీసుకుంది. అయితే 12వ తరగతి విద్యార్థుల కు సీబీఎ్‌సఈ రెండు ఐచ్ఛికాలను కల్పించింది. ఒకటి పరిస్థితులు కుదుట పడిన తరవాత నిర్వహించే పరీక్షలకు హాజరవడం, రెండోది అంతర్గత పరీక్షల మార్కు ల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకోవడం.
🌻విద్యార్థుల నిర్ణయానంతరం జూలై 15లోగా సీబీఎ్‌సఈ ఫలితాలు ప్రకటించనుంది. 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు. సీబీఎ్‌సఈ తీసుకునే అంతిమ నిర్ణ యం మేరకు వీరిని ఉత్తీర్ణులను చేస్తారు. దీనికి సం బంధించిన కసరత్తు బోర్డులో మొదలైంది. గత 3అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకునే ఆలోచనలో బోర్డు ఉంది. కాగా, పరీక్షలు రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు సీబీఎ్‌సఈ గురువారం తెలిపింది. కరోనా తీవ్రత దృష్ట్యా సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేయాలని కొందరు తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషిన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం నాటి విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఎ్‌సఈ నిర్ణయాన్ని తెలిపారు.
🌻ఫలితాల వెల్లడి తేదీతో పాటు సమగ్ర కాలక్రమాన్ని పరీక్షల నోటిఫికేషన్‌లో ప్రస్తావించాలని కోర్టు సూచించింది. శుక్రవారం నాటికి తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని మెహతా సమాధానమిచ్చారు. అంతర్గత మూల్యాంకన విధానంపైనా ఈ నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు జూలై 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్సీ-10వ తరగతి), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్సీ-12వ తరగతి) పరీక్షలు కూడా రద్దయ్యాయి. అయితే, విద్యార్థులకు ఐసీఎస్సీ ఎలాంటి ఐచ్చికాలు ఇవ్వలేదు. విద్యార్థుల ఉత్తీర్ణతకు అంతర్గత మూల్యాంకన విధానాన్ని అనుసరిస్తామని సుప్రీంకోర్టుకు ఐసీఎస్సీ తరఫున హాజరైన న్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. కాగా, పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరిన న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 28న ఐఐఎం రోహతక్ ప్రవేశపరీక్ష నిర్వహిస్తుందని, పోటీ పరీక్షలను కూడా వాయిదా వేయాలని న్యాయవాది సందీప్ జిందాల్ కోరారు. స్పందించిన ధర్మాసనం ‘బాధిత వ్యక్తులు రానివ్వండి. ఇక్కడి నుంచి విద్యా సంస్థలను నడిపించలేము. బోర్డు పరీక్షల గురించే విచారణ జరుపుతున్నాము’ అని వ్యాఖ్యానించింది.

0 Comments