★ SureshSoori Info ★



💬 చైనా యాప్స్ బదులు ఇవి వాడండి

*🔸బ్రౌజింగ్ : ఇన్నాళ్లూ మీరు బ్రౌజింగ్ కోసం... యూసీ బ్రౌజర్ వాడుతున్నట్లైతే... ఇకపై అది ఉండదు కాబట్టి... దాని బదులు గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటివి వాడొచ్చు.సెక్యూరిటీ : మొబైల్‌లో వైరస్ చేరకుండా... అవాస్తా, ఏవీజీ, నార్తన్‌ యాంటీ వైరస్‌ వంటి యాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.*

*ఫైల్స్‌ షేరింగ్ : షేర్‌ఇట్‌ బదులుగా షేర్‌ ఫైల్స్‌, ఫైల్స్‌ బై వంటి యాప్స్ వాడొచ్చు.*

*ఫొటో ఎడిటింగ్ : అడోబ్ ఫొటోషాప్, గూగుల్ స్నాప్‌సీడ్, పిక్స్ ఆర్ట్, లైట్ రూమ్, బీ612 వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు.*

*స్కాన్‌ : ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, అడోబ్ స్కాన్, ఫొటో స్కాన్ బై గూగుల్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటివి వాడొచ్చు.*

*వీడియో ఎడిటింగ్ : వీడియోలను ఎడిట్ చెయ్యడానికి చాలా ఆప్షన్లున్నాయి. అడోబ్‌ ప్రిమియర్‌ క్లిప్‌, మ్యాజిస్టో, కైన్‌ మాస్టర్‌ యాప్స్‌ బాగా ఉపయోగపడతాయి.వీడియో షేరింగ్‌ : టిక్‌టాక్ బదులుగా... రోపోసో, డబ్‌ స్మాష్‌, పెరిస్కోప్‌, యూట్యూబ్ లాంటి వాటిని వాడొచ్చు.*

*రెండు అకౌంట్లు : ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే క్లోన్‌ యాప్‌, సూపర్‌ క్లోన్‌ వంటివి యాప్స్‌ ఉపయోగపడుతున్నాయి.*

*మొబైల్ లాక్‌ : ఇందుకు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. లాక్‌ యాప్‌ - స్మార్ట్‌ యాప్‌ లాకర్, లాక్‌ యాప్‌ - ఫింగర్‌ప్రింట్‌, కీప్‌ సేఫ్‌, నొర్టన్‌ యాప్‌ లాక్‌, లాక్‌ మై పిక్స్‌ సీక్రెట్‌ ఫొటో వాల్ట్‌ వంటివి వాడితే... చైనాకి చెక్ పెట్టినట్లే.*


*వీడియో కాన్ఫరెన్స్‌ : ప్రస్తుతం అందరూ వాడుతున్న జూమ్‌పై కేంద్రం నిషేధం విధించకపోయినా... దానికి ఆల్టర్నేట్‌గా గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌, సే నమస్తే వంటి యాప్స్ వాడుకోవచ్చు.*

*టైపింగ్ : డీఫాల్ట్ టైపింగ్ కీబోర్డు నచ్చకపోతే... గూగుల్‌ ఇండిక్‌ కీబోర్డు , జీ బోర్డ్‌, గింగర్‌ కీబోర్డు, మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌ కీబోర్డు వంటివి ట్రై చెయ్యవచ్చు.*

ఆఫీస్ వర్క్ : వర్డ్ ఎక్సెల్ షీట్ల వంటి వాటి కోసం మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, ఓన్లీ ఆఫీస్‌ వంటివి వాడొచ్చు.

🍁🍃🍁🍃🍁🍁🍃🍁


#Banned #ChainaApps #Tiktok