★SureshSoori Info★
♦30 వేల టీచర్ పోస్టులు హుష్‌కాకి!
🔸ప్రాథమిక పాఠశాలల్లో 15 వేలు
🔹హైస్కూళ్లలో 12 వేలకు పైగా
🔸డీఎస్సీ నోటిఫికేషన్లకూ నో చాన్స్
🔹హేతుబద్ధీకరణపై టెన్షన్
🎯అమరావతి - ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగ పాఠశాలల్లో హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల టీచర్ పోస్టులు మాయమవుతాయని తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 15 వేలు, ఉన్నత పాఠశాలల్లో 12 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు నుంచి మూడు వేల వరకు పోస్టులు రద్దవుతాయని అంచనా వేస్తున్నారు.
🎯ఫలితంగా భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
🎯ప్రాథమిక పాఠశాలల్లో ఇకపై సింగిల్ టీచర్‌లు ఉండరని, కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారని చెబుతూనే.. అసలుకే ఎసరు పెట్టేలా హేతుబద్ధీకరణ కార్యాచరణ ఉందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.
🎯ఇప్పుడు 20లోపు విద్యార్థులు ఉంటే సింగిల్ టీచర్, 40 వరకు ఉంటే రెండో పోస్టు, 60 వరకు మూడో పోస్టు, 80 వరకు నాలుగో పోస్టు, 100 వరకు ఐదో పోస్టు, 120 వరకు ఆరో పోస్టు + ఎల్‌ఎ్‌ఫఎల్ హెడ్మాస్టర్ పోస్టు కేటాయిస్తున్నారు. ఇప్పుడు... 1:30 ప్రకారమే టీచర్ల పోస్టులను ఇస్తామంటున్నారు.
🎯ఉన్నత పాఠశాలల్లో ఇప్పటి వరకు 240 మంది విద్యార్థులకు 9 పోస్టులను నిర్ధారించారు. 240 మందికి మించి విద్యార్థులు ఉంటే మరో సెక్షన్ ఇచ్చే వారు. ఇప్పుడు 320 మందికి మించితేనే రెండో సెక్షన్ ఇస్తామని ప్రతిపాదించారు. అంతకన్నా తక్కువ మంది ఉంటే సింగిల్ పోస్టు మాత్రమే కేటాయిస్తారన్న మాట.
🎯తాజా ప్రతిపాదనల వల్ల టీచర్ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉన్నందు వల్ల తక్షణమే హేతుబద్ధీకరణను వాయిదా వేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌టీయూఎస్) గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎ.ఎ్‌స.రామకృష్ణ, అధ్యక్షులు చెరుకూరి సుభాష్ చంద్రబో్‌సలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు తెరిచిన తర్వాత నెలరోజుల పాటు అడ్మిషన్లకు గడువు ఇచ్చి అనంతరం హేతుబద్ధీకరణ చేపట్టాలని వారు కోరారు.
#APDSC #2020
★Follow this link to join my WhatsApp group:
🕹 Group Link

0 Comments