Recents in Beach

💣 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం

పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం

               ★SureshSoori Infoo★

పలుశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదించింది. 5701 కొత్త పోస్టుల భర్తీతోపాటు చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్న 4011 పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయించారు.

శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేశారు.

 31 స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ల పోస్టులను అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్‌కు కేబినెట్‌ ఆమోదించింది.

 సీఐడీలో 10 జూనియర్‌ అసిస్టెంట్లు, 10 స్టెనో పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

 13 పోస్టులు డిప్యుటేషన్‌ ప్రాతిపదికన, 1 కాంట్రాక్టు ప్రాతిపదికన, 14 పోస్టులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మంజూరు చేశారు.

కడప జిల్లా వెంకటంపల్లెలో వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ కింద ఉన్న అరటి పరిశోధనా సంస్థలో 11 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ అంగీకరించింది. వీటిలో 5 టీచింగ్‌ పోస్టులు, 6 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.

ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీ గుంటూరులో హోంసైన్స్‌ విభాగంలో 2 ప్రొఫెసర్, 4 అసోసియేట్‌ ప్రొఫెసర్ల మంజూరుకు సమావేశం ఆమోదించింది.

 ఏపీ స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టర్‌ పోస్టు మంజూరుచేసింది.


#ApJobs #Andrapradesh

Post a Comment

0 Comments