♦అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సన్నాహాలు
నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు
🌼Guntur
*🎯ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల(హెల్పర్) పోస్టుల ఖాళీల భర్తీకి రంగం సిద్ధమవుతోంది.*
*🎯జిల్లాలో 23 ప్రాజెక్టుల పరిధిలో 4405 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. పదవీ విరమణ.. పదోన్నతులు.. వేరే ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోవడం.. చనిపోవడంతో పాటు వివిధ కారణాలతో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులు జిల్లా వ్యాప్తంగా చాలా ఖాళీ అయ్యాయి. మాతాశిశు సంరక్షణ సేవల్ని పటిష్ఠవంతం చేయడంలో భాగంగా ఖాళీలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.*
*🎯దీంతో ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల్ని సీడీపీవోలు సేకరించి జిల్లా స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలి నియామకానికి ప్రస్తుతం విద్యార్హత పదో తరగతిగా ఉంది. ఇరువురికి వేతనాలు ఆశాజనకంగా ఉండడంతో పోస్టులకు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది.*
*🎯జిల్లాలోని సాధారణ అంగన్‌వాడీ కేంద్రాల్లో 88 కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక కార్యకర్త పోస్టు.. అన్ని కేంద్రాల్లో కలిపి 317 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.*
*🎯వారంలోపు జిల్లా కలెక్టర్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.*
*🎯దరఖాస్తు విధానంపై నోటిషికేషన్‌లో స్పష్టత ఇవ్వనున్నారు. జిల్లాలో 89 అంగన్‌వాడీ కార్యకర్తలు, 317 సహాయకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ మనోరంజని పేర్కొన్నారు*
#ApICDS
0 Comments